తెలంగాణ

telangana

ETV Bharat / crime

పరిహారం కోసం ఆత్మహత్య.. మృతదేహంతో బంధువుల ఆందోళన

బస్వాపురం జలాశయ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయినా.. పరిహారం అందలేదని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బి.ఎన్. తిమ్మాపూర్​కు చెందిన నిర్వాసితుడు సతీశ్​ బస్వాపురం ప్రాజెక్టు వద్ద గతనెల 10వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు.

By

Published : May 4, 2021, 10:41 PM IST

dharna at basavapuram project with dead body
బస్వాపురం ప్రాజెక్టు వద్ద మృతదేహంతో బంధువుల ఆందోళన

బస్వాపురం జలాశయం నిర్మాణంలో ముంపునకు గురైన నష్టపరిహారం అందకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. దీంతో మృతదేహంతో ప్రాజెక్టు వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బి.ఎన్. తిమ్మాపూర్​కు చెందిన సతీశ్ గత నెల 10 వ తేదీన ఆత్మహత్యకు యత్నించాడు. తన ఆటోతో పాటు పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.

బంధువుల ధర్నా

అతని మరణంతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు, గ్రామస్థులు బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం వద్ద సతీశ్​ మృతదేహంతో ధర్నాకు దిగారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రాజెక్టు వద్దే బైఠాయించారు. ఈ పరిణామాలతో పోలీసులు ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

భువనగిరి మండలం బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పిన్నం సతీశ్​కు 12 ఎకరాల భూమి ఉండగా, అందులో 9 ఎకరాల విషయంలో వివాదం నడుస్తోంది. ఆ భూమి మరో వ్యక్తి పేరుతో నమోదైంది. దీంతో వారి మధ్య ఏర్పడిన వివాదాన్ని గ్రామ పెద్దలు ఒప్పంద పత్రం రాయించి సమస్యను పరిష్కరించారు. భూమిలో 75 శాతం పరిహారం సతీశ్​కు అందాల్సి ఉండగా... గత మూడు నెలలుగా పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. వెంటనే ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా.. జమ కాకపోవడంతో విసిగిపోయి ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు పేర్కొన్నారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రాజెక్టు వద్ద బంధువులు, గ్రామస్థులు మృతదేహంతో ధర్నా నిర్వహించారు.

ఇదీ చూడండి:ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది: రాజాసింగ్​

ABOUT THE AUTHOR

...view details