Daughter Attacked On Mother: కుమార్తె దాడిలో తల్లి తల, గొంతుకు తీవ్ర గాయాలైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ పురపాలిక పరిధి తిమ్మసానిపల్లిలోని అద్దె ఇంట్లో నజ్మా బేగం అనే మహిళ తన భర్త, చిన్న కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్త బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం తల్లి తన 12 ఏళ్ల కుమార్తెను వంటపాత్రలు కడగమని కోరారు. కుమార్తె ఒప్పుకోకపోవటంతో ఆమె కొట్టారు. ఈ క్రమంలో కుమార్తె అట్లకాడతో తల్లిపై దాడికి దిగింది. ఒంటిపై కారం చల్లింది. ఈ దాడిలో తలపై తీవ్ర గాయాలు కావటంతోపాటు గొంతు కోసుకుపోయింది.
Daughter Attacked On Mother: వంటింటి తగాదా.. తల్లి గొంతు కోసిన కుమార్తె - Mahabubnagar Crime Updates
Daughter Attacked On Mother: క్షణికావేశంలో కూరగాయలు తరిగే కత్తితో కన్నతల్లి గొంతు కోసింది ఓ కుమార్తె. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తల్లిని తరలించారు. గొంతు, తల భాగంలో కుట్లు వేసిన వైద్యులు తర్వాత స్కానింగ్ చేయించారు. నజ్మా బేగం పరిస్థితి విషమంగానే ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి పర్యవేక్షకులు డా. రమేశ్, ఉప పర్యవేక్షకులు డా.జీవన్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సిబ్బంది పరిశీలించామని, దాడిచేసిన బాలిక మానసిక స్థితి బాగా లేదని పోలీసులు పేర్కొన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైందని, చిన్న కుమార్తె చిన్నతనంలో పాఠశాలకు వెళ్తూ కిందపడటంతో తలకు గాయమైందని, ఆమె మానసిక ఎదుగుదల లోపించిందని, మాటలు కూడా సరిగ్గా రావని తండ్రి అబ్బుల్ హమీద్ తెలిపారు.
ఇదీ చదవండి:ఆన్లైన్లో 'చికెన్ టిక్కా పిజ్జా' ఆర్డర్- 2 ముక్కలు తిన్న క్షణాల్లోనే గుండె ఆగి..