లాక్డౌన్లో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. డేటింగ్ యాప్‌ల వినియోగమూ ఎక్కువైంది. కొత్త స్నేహాల మాయలో కనీవినీ ఎరుగని రీతిలో మోసాలు జరిగాయి. విదేశీ సంస్కృతిని అనుసరిస్తూ లక్షలాది రూపాయలను యువత నష్టపోయింది. సరదా కోసం ప్రారంభించిన అలవాటు వ్యసనంగా మారి చిక్కులు తెచ్చుకుంటున్నారు. మాయ మాటలతో తెలివిగా వ్యక్తిగత వివరాలు సేకరిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు.
డేటింగ్ యాప్స్‌తో హనీ ట్రాప్స్.. యూత్ ప్లీజ్ బీ కేర్‌ఫుల్ - dating applications usage is increased during lockdown
లాక్ డౌన్ సమయంలో డేటింగ్ యాప్‌ల వినియోగం భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా మోసపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువైంది. అందమైన యువతులను, ఆకర్షించే మాటలను ఎరగా వేసి... డేటింగ్ ఉచ్చులోకి లాగుతున్నారు...సైబర్ నేరగాళ్లు. ఏ మాత్రం అనుమానం రాకుండా... చాలా తెలివిగా వ్యక్తిగత సమాచారం, విలువైన డేటా సేకరించి... అందిన కాడికి దోచుకుంటున్నారు.
డేటింగ్ యాప్స్‌తో హనీ ట్రాప్స్
వీలుకాకపోతే...నీ గుట్టంతా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అలా లక్షలాది రూపాయల్ని బలవంతంగా వసూలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎలాంటి మాటలతో నమ్మకం కలిగిస్తారు...? ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తారు...? ఆ విషవలయంలో చిక్కుకోకుండా యువత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తదితర అంశాలపై సైబర్ నిపుణులు అనిల్ రాచమల్లతో ఈటీవీ ముఖాముఖి...
- ఇదీ చూడండి :దేశంలో 57.29% మందికి ఇంటర్నెట్ కనెక్షన్లు