కస్టమర్ కేర్ పేరుతో ఓ బ్యాంకు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం (Cyber Crime news) చేశారు. ఈ ఘటన హైదరాబాద్ బాలానగర్‌లో జరిగింది. ఫిరోజ్‌గూడకు చెందిన చెందిన ఓ యువతి ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్ చేశారు. పేమెంట్ చేశాక.. సదరు యువతికి ఎటువంటి మెసేజ్ రాలేదు. ఆందోళన చెందిన ఆమె గూగుల్‌లో బ్యాంక్ కస్టమర్ నంబర్ కోసం వెతికింది. అందులో దొరికిన నంబర్‌కు కాల్ చేసి మాట్లాడారు. అక్కడే సైబర్ నేరగాళ్లకు చిక్కారు.
Cyber Crime: గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేస్తే.. - telangana latest news
గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేసిన.. బ్యాంకు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బురిడీ (Cyber Crime news) కొట్టించారు. అందినకాడికి దోచుకున్నారు. హైదరాబాద్ బాలానగర్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
బ్యాంక్ కస్టమర్ కేర్ సిబ్బందిలా యువతిని నమ్మించి కేటుగాళ్లు.. మొబిక్విక్ బజాజ్ వాలెట్‌ను ఆమె ఫోన్లో ఇన్స్టాల్ చేయించారు. అనంతరం డెబిట్ కార్డు ద్వారా తొలుత ఐదు రూపాయలు చెల్లించమన్న నేరగాళ్లు.. అంతలోనే ఆమె ఖాతా నుంచి రూ.20 వేల కాజేశారు. అనంతరం మరో రెండు విడతల్లో మరో రెండు వేలు డెబిట్ అయినట్లు సదరు యువతి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అప్పటికి మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు కేసునమోదు చేశారు.
ఇదీచూడండి:Cyber Crime: సరికొత్తగా.. ఓటీపీ చెప్పకుండానే రూ.19లక్షలు మాయం