హైదరాబాద్ నగరంలో పోలీసులు లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో.. ఇవాళ ఒక్కరోజే అకారణంగా రోడ్లపైకి వచ్చిన 1,436 వాహనాలపై కేసులు నమోదు చేశారు. గత మూడు రోజులుగా మొత్తం 5,888 వాహనాలను జప్తు చేసినట్లు వారు తెలిపారు.
అకారణంగా బయటికొస్తే.. బండ్లు సీజ్! - vehicles seized
లాక్‌డౌన్ ఆంక్షలను పలువురు వాహనదారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసుల హెచ్చరికలను అస్సలు లెక్క చేయడం లేదు. ఇలాగే చిన్న చిన్న కారణాలతో రోడ్ల పైకి వచ్చిన వెయ్యికి పైగా వాహనాలపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
vehicles seized
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఎవరూ బయటకు రావొద్దని కోరుతోన్న.. పలువురు వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని పోలీసులు అంటున్నారు. చిన్న చిన్న కారణాలతో రోడ్ల పైకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్ముందు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా, లాక్‌డౌన్ సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష