తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber crime: మంత్రి పువ్వాడ పేరుతో నకిలీ ఈమెయిల్ - తెలంగాణ వార్తలు

Cyber crime: ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులనూ తమ ఉచ్చులో బిగిస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​ పేరుతో ఆర్టీసీ చీఫ్ కంట్రోల్ మేనేజర్​కు నకిలీ ఈమెయిల్ పంపించారు. అది నకిలీ ఈమెయిల్ అని గుర్తించిన ఆ అధికారి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber crime
Cyber crime

By

Published : Dec 7, 2021, 4:21 AM IST

Updated : Dec 7, 2021, 6:23 AM IST

Fake email on puvvada name: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలు చెప్పి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులనూ తమ ఉచ్చులో బిగిస్తున్నారు. తాజాగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​ పేరుతో ఆర్టీసీ చీఫ్ కంట్రోల్ మేనేజర్​కు నకిలీ ఈమెయిల్ పంపించారు.

అది నకిలీ ఈమెయిల్ అని గుర్తించిన చీఫ్ కంట్రోల్ మేనేజర్ హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు ఎక్కడెక్కడో ఉంటూ ప్రజలను మోసం చేస్తున్నారని చీఫ్ కంట్రోల్ మేనేజర్ అన్నారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:Woman Suicide for Blouse : భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య

Last Updated : Dec 7, 2021, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details