తెలంగాణ

telangana

ETV Bharat / crime

cyber crime news: క్రెడిట్​ కార్డ్​ రివార్డ్​ పాయింట్స్​ పేరిట లింక్.. ఓపెన్​ చేస్తే... - cyber crime cheaters sends links

cyber crime news: క్రిడెట్​ కార్డు రివార్డ్​ పాయింట్స్​ పేరిట లింక్​ పంపి.. రూ.1.11 లక్షలు కాజేశారు.. సైబర్​ నేరగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్​ బాలానగర్​లో చోటుచేసుకొంది. దీంతో కంగుతిన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

cyber crime news
cyber crime news

By

Published : Dec 27, 2021, 6:37 AM IST

cyber crime news: క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్స్ పేరుతో అందినకాడికి దోచుకున్నారు.. సైబర్​ నేరగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్​ బాలానగర్​లో చోటుచేసుకొంది. ఐడీపీఎల్​ చెందిన సుభాశ్​కు ఓ ప్రైవేటు బ్యాంకులో క్రెడిట్​ కార్డు ఉంది. ఇటీవల సుభాష్​కు ఓ మెసెజ్​ వచ్చింది. క్రెడిట్​ కార్డుకు రివార్డు పాయింట్స్​ వచ్చాయంటూ ఆ మెసెజ్​లో ఓ లింక్​ పంపారు. నిజమేనని నమ్మిన సుభాష్​.. తన ఖాతాకు సంబంధించిన వివరాలు అందులో నమోదు చేశాడు.

రూ.1.11 లక్షలు కాజేత..

దీంతో వెంటనే ఆ ఖాతా నుంచి రూ.1.11 లక్షలు డెబిట్​ అయ్యాయి. ఆ మేరకు సుభాష్​కు మెసెజ్​ వచ్చింది. కంగుతున్న బాధితుడు బాలానగర్​ పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.... సైబర్​ ఉచ్చుగా గుర్తించారు. వెంటనే దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details