తెలంగాణ

telangana

ETV Bharat / crime

నీరజ్​ హత్య కేసు.. ఇద్దరు నిందితులకు ముగిసిన కస్టడీ - ts news

Honor killing case: బేగంబజార్​లో జరిగిన నీరజ్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు పోలీసు కస్టడీ ముగిసింది. నిందితుల నుంచి పలు వివరాలను పోలీసులు సేకరించారు. సంజనకు పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకే... హత్యకు కుట్ర పన్నినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు.

నీరజ్​ హత్య కేసు.. ఇద్దరు నిందితులకు ముగిసిన కస్టడీ
నీరజ్​ హత్య కేసు.. ఇద్దరు నిందితులకు ముగిసిన కస్టడీ

By

Published : May 30, 2022, 9:15 PM IST

Honor killing case: బేగంబజార్​లో జరిగిన నీరజ్ హత్య కేసులో పోలీసులు నిందితుల సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా విజయ్, సంజయ్​లను పోలీసులు ప్రశ్నించారు. సోమవారంతో ఇద్దరు నిందితుల కస్టడీ ముగిసింది. నిందితుల నుంచి పలు వివరాలను పోలీసులు సేకరించారు. నిందితులు హత్యానంతరం కర్ణాటక వైపు పారిపోయారు. పరిగి సమీపంలో ద్విచక్ర వాహనాలను వదిలి ప్రైవేట్ వాహనంలో కర్ణాటక వైపు వెళ్లారు. సెల్​ఫోన్లను సైతం ఓ ప్రాంతంలో ఉంచారు. నిందితులను ప్రశ్నించి సెల్​ఫోన్ల గురించి తెలుసుకొని వాటిని సీజ్ చేశారు. నిందితుల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. నీరజ్ హత్యకు దారితీసిన కారణాలను నిందితులను అడిగి తెలుసుకున్నారు.

సంజనకు పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకే... హత్యకు కుట్ర పన్నినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. సంజన, నీరజ్ గతేడాది ఏప్రిల్​లో వివాహం చేసుకున్న తర్వాత దాదాపు 8 నెలల పాటు రాజస్థాన్, పాతబస్తీలో నివాసం ఉన్నారు. 4 నెలల క్రితం మళ్లీ బేగంబజార్​లోని సొంతింటికి రావడం, కాలనీలో తిరగడం చూసి తట్టుకోలేక నీరజ్​ను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యలో ఇప్పటికే జైల్లో ఉన్న మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా షాహినాయత్ గంజ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభినందన్, మహేష్, ప్రశాంత్​లను 4రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details