సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికందొచ్చిన పంటను నీట ముంచి, రైతుల కష్టాన్ని కన్నీళ్ల పాలు చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. నేలపాలు కావడంతో అన్నదాతల బాధ వర్ణనాతీతంగా మారింది.
వడగండ్ల వర్షం.. తెచ్చింది పంట నష్టం - వాన బీభత్సం
సిద్దిపేట జిల్లాలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షానికి నీట మునిగింది. గాలివాన.. పంట చేతికి అందుతుందనుకున్న అన్నదాతల ఆశను, నిరాశ చేసింది. జిల్లాలో సాయంత్రం కురిసిన వర్షం.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.
వడగండ్ల వర్షం
అకాల వర్షం కారణంగా కోహెడ మండలంలోని శంకర్ నగర్, నకిరి కొమ్ముల, గోట్లమిట్ట, వరికోలు, వింజపల్లి గ్రామాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట నేల వాలి.. ఈదురు గాలుల ధాటికి పూర్తిగా నీట మునిగింది. మామిడికాయలు నేలరాలాయి. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ పంట పూర్తిగా తడిసి ముద్దయింది.