తెలంగాణ

telangana

By

Published : Jun 22, 2021, 5:07 PM IST

Updated : Jun 22, 2021, 7:42 PM IST

ETV Bharat / crime

BETTING GANG ARRESTED: పాకిస్థాన్​లో మ్యాచ్​.. హైదరాబాద్​లో బెట్టింగ్​

బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.21.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. యువత బెట్టింగ్​లో పాల్గొని నష్టపోవద్దని ఆయన సూచించారు.

cp sajjanar, cricket gang arrest
సీపీ సజ్జనార్, క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

యువత బెట్టింగ్‌లో పాల్గొని నష్టపోవద్దని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. హైదరాబాద్‌ బాచుపల్లిలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి వారినుంచి రూ.21,50,000 నగదు, బెట్టింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కోసం బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తూ ఆన్‌లైన్‌లో డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొనకుండా తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని సూచించారు.

ఈనెల 8 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా పాకిస్థాన్​లో జరిగే సూపర్ లీగ్స్​కు ఈ ముఠా బెట్టింగ్ చేస్తుంది. నిజాంపేట్​లో ఓ భవనంపై రైడ్ చేస్తే ఈ వ్యవహారం బయట పడింది. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన సోమన్న ఆధ్వర్యంలో ఈ బెట్టింగ్ నడుస్తోంది. నిందితుల నుంచి నగదుతో పాటు 26 మొబైల్స్, కమ్యూనికేటర్ బోర్డ్, వైఫై రూటర్ స్వాధీనం చేసుకున్నాం. హవాలా డబ్బు ద్వారా ఈ బెట్టింగ్ నిర్వహించినట్లు విచారణలో తేలింది. లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365 ఈ ఆన్ లైన్ యాప్స్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారు. ఎక్కువగా యువకులు, విద్యార్థులే వీటిలో పాల్గొంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి.

-సీపీ సజ్జనార్

పాకిస్థాన్​లో మ్యాచ్​.. హైదరాాబాద్​లో బెట్టింగ్​

ఇదీ చదవండి:గర్భిణీని బైక్​తో ఢీకొట్టిన వ్యక్తి అరెస్ట్

Last Updated : Jun 22, 2021, 7:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details