జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామంలో కొవిడ్ బాధితురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి అడవిలో చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న లక్ష్మి... కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారిన పడింది. అప్పటి నుంచి తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. మనస్తాపంతో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది.
అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని కొవిడ్ బాధిత మహిళ ఆత్మహత్య - జయశంకర్ భూపాలపల్లి నేర వార్తలు
కొవిడ్ బారిన పడిన ఓ మహిళ మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుటలో జరిగింది.
జయశంకర్ భూపాలపల్లి వార్తలు
ఎంత వెతికినా కనిపించలేదు. ఇవాళ ఉదయం ఉపాధి కూలీలు అడవి సమీపంలో పని చేయడానికి వెళ్లగా అడవిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:పోలీసుల సమక్షంలో ఇసుక కుప్పలో శవం వెలికితీత