మెదక్ పట్టణంలోని గాంధీనగర్ వీధిలోని బుడగజంగాల కాలనీకి చెందిన రాములుకు కొద్దిరోజుల క్రితం పక్షవాతం రాగా ఆయన భార్య లక్ష్మి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కరోనా లాక్డౌన్తో ఉన్న ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేక దీనావస్థకు చేరారు. ఎవరినీ అడగడానికి ముఖం చాలక మనస్తాపానికి గురైన భార్యాభర్తలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Suicide : లాక్డౌన్ వల్ల తిండి దొరకక దంపతుల ఆత్మహత్య - telangana news
లాక్డౌన్ వల్ల చేయడానికి పని దొరకక.. తినడానికి తిండి లేక మనస్తాపానికి గురైన భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది.
ఇంటికొచ్చిన కుమారుడు గమనించి చుట్టుపక్కల వారిని పిలిచాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆకలి బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన రాములు, లక్ష్మి దంపతుల కుటుంబానికి టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ ఆర్థిక సాయం అందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని, లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాల్సిన సర్కార్ వారిని పట్టించుకోకపోవడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. కరోనా వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం, అధికారులు, దాతలు అండగా నిలవాలని కోరారు.
- ఇదీ చదవండి :స్పుత్నిక్ టీకా విషయంలో థర్డ్పార్టీపై చర్యలు!