couple suicide at karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అశోక్ నగర్ కు చెందిన నార్ల వెంకటేష్ సుజాత దంపతులు తాము నివాసముంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.
couple suicide at karimnagar: బతుకు భారమై.. చావే శరణ్యమై - కరీంనగర్ తాజా నేర వార్తలు
couple suicide at karimnagar: వారికి ఇద్దరు పిల్లలు ఉన్నంతలో వివాహం జరిపించారు. బాధ్యతలు తీరాక కిరాణా దుకాణం నడపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అది సరిగా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురయ్యారు. దీనికి చావే పరిష్కారమని నిర్ణయించుకుని ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
కరీంనగర్ లో ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య
వీరికి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరికి వివాహం అయింది. ఈ సమయంలో కిరాణా దుకాణం సరిగా నడవక పోవడంతో మానసిక వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బాల్కనీలో ఉరి వేసుకున్నారు. ఇది గమనించిన కుమారుడు స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Mother Jumped into Well with kids : ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకిన తల్లి
Last Updated : Mar 5, 2022, 2:44 PM IST