Couple Suicide in YSR District: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. వేపరాల గ్రామానికి చెందిన పల్లా గోవర్ధన్, వరలక్ష్మి దంపతులు మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. సోమవారం ఉదయం తమ ఇద్దరు పిల్లలను కట్టపైన ఉంచి.. నీళ్లలోకి దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు పిల్లలను గమనించిన పోలీసులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా వరలక్ష్మి మృతదేహాన్ని వెలికి తీశారు. గోవర్ధన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా బలవన్మరణానికి యత్నించి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు.
జలాశయంలోకి దూకిన భార్యభర్తలు.. ఆర్థిక పరిస్థితులే కారణం..! - andhra pradesh crime news
Couple Suicide in YSR District: ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, వారిని ఆనకట్టపై ఉంచి.. దంపతులు ఇద్దరూ జలాశయంలో దూకారు. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలంలో చోటుచేసుకుంది. భార్య మృతదేహం దొరకగా, భర్త కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Couple Suicide in YSR District