తెలంగాణ

telangana

ETV Bharat / crime

యూట్యూబ్​లో చూసి నకిలీ నోట్ల తయారీ.. దంపతుల అరెస్ట్

నకిలీ నోట్లు ముద్రిస్తూ మార్కెట్​లో మారుస్తున్న దంపతులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్​లో చూస్తూ నోట్లను ముద్రించేవారని తెలిపారు. ఇందుకోసం స్కానర్​తో కూడిన కలర్ ప్రింటర్, కరెన్సీకి అవసరమైన కాగితాలను కొనుగోలు చేశారని పేర్కొన్నారు.

fake currency, couple arrest
నకిలీ నోట్ల ముద్రణ కేసు, దంపతులు అరెస్ట్

By

Published : Jun 2, 2021, 2:48 PM IST

నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్​లో మారుస్తున్న దంపతులు వరంగల్ పోలీసులకు చిక్కారు. నగరంలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు రమేశ్​, సరస్వతి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యూట్యూబ్​లో చూసి తయారు చేశారని పేర్కొన్నారు. ఇందుకోసం స్కానర్​తో కూడిన కలర్ ప్రింటర్, కరెన్సీకి అవసరమైన కాగితాలను కొనుగోలు చేశారని అన్నారు. రూ.2వేలు, 500, 200, 100, 50,20 నోట్లను ముద్రించి దుకాణాల్లో మారుస్తున్నారని వెల్లడించారు.

నకిలీ నోట్లకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు రావడంతో టాస్క్​ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వీరిని అరెస్ట్ చేసి ముద్రణా పరికరాలతోపాటు, 10లక్షల 9 వేల 960 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇదీ చదవండి:Corona Vaccine: విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్‌..!

ABOUT THE AUTHOR

...view details