Fake Seeds: రూ.13 కోట్ల విలువైన నకిలీ మిరప విత్తనాలు స్వాధీనం
10:45 June 10
రూ.13 కోట్ల విలువైన నకిలీ మిరప విత్తనాలు స్వాధీనం
ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల విక్రయంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్దమొత్తంలో విత్తనాలు స్వాధీనం చేసుకోగా.. సూర్యాపేట జిల్లాలో మరోసారి భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ వనస్థలిపురం కేంద్రంగా..... శివారెడ్డి అనే వ్యక్తి ద్వారకా సీడ్స్ పేరిట మిరప, టమాట, బెండ, దొండ సహా 15 రకాల నకిలీ విత్తనాలు తయారు చేస్తునట్లు పోలీసులు
వెల్లడించారు. నిన్న సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో నకిలీ విత్తనాలు గుర్తించి.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పలుచోట్ల డీలర్లను నియమించుకుని నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. ద్వారకా సీడ్స్ అకౌంటెంట్ యాదగిరి, రీజినల్ మేనేజర్ లక్ష్మారెడ్డి సహా నకిలీ విత్తనాలు తయారుచేసి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.