ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్లో దాచిన మద్యం దుకాణాల నగదును చోరీ చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
పోలీస్ స్టేషన్లో నగదు చోరీ.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్ - Veeravasaram pc conistables suspend
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఠాణాలో దాచిన నగదును వీరు చోరీ చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కి చెందిన కానిస్టేబుళ్లు గంగాజలం, గణేశ్వరరావులను విధుల నుంచి తొలగించారు. పోలీస్‌స్టేషన్‌లో దాచిన మద్యం దుకాణాల సొమ్ము చోరీకి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఠాణా ఎస్‌ఐ రామచంద్రరావు, ఏఎస్‌ఐ ఎం.మోహనరావులను వీఆర్‌కు పంపారు.