నలుగురికి చెప్పే స్థానంలో ఉండి... అతనే సహనాన్ని కోల్పోయాడు. కుటుంబసమస్యలు తాత్కాలికమైనవేనని భావించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్. వికారాబాద్ జిల్లా ఎన్నేపల్లిలో కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ డేవిడ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Conistable Suicide: కుటుంబ సమస్యలతో కానిస్టేబుల్ ఆత్మహత్య - vikarabad district
కానిస్టేబుల్ బలవన్మరణం
09:36 October 29
కానిస్టేబుల్ బలవన్మరణం
బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్‌లో డేవిడ్ విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో నెల రోజులుగా... డేవిడ్ విధులకు హాజరుకావడం లేదు. డేవిడ్ భార్య స్నేహలత.. దేవాదాయశాఖలో ఈవోగా పని చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Suicide Attempt: మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అసలేమైంది?