హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పీఎస్ విధులు నిర్వహించే కానిస్టేబుల్ వెంకటేశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈరోజు ఉదయం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించాడు. అయితే కుటుంబసభ్యులు వెంటనే లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణపాయం లేదని బంధువులు తెలిపారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం... అదే కారణమా..?
ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పీఎస్లో పనిచేసే వెంకటేశ్ నిద్రమాత్రలు మింగాడు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అత్తాపూర్ వద్ద విధుల్లో ఉన్న సమయంలో రాంగ్ రూట్లో బండి నడుపుకుంటూ కానిస్టేబుల్ వెంకటేశ్ వెళుతుండటం గమనించారు. అతన్ని ఆపి ప్రశ్నించగా తాను డిపార్ట్మెంట్ అని దురుసుగా మాట్లాడటంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుల బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా రీడింగ్ 36గా నమోదైంది. అతని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్ (Cp anjani kumar) వెంకటేశ్‌ను సస్పెండ్ (Suspend) చేస్తూ ఆదేశాలు జారీచేశారు.