తెలంగాణ

telangana

ETV Bharat / crime

CONGRESS PROTEST: సీఎం మీటింగ్​లు పెట్టొచ్చు... మేము ధర్నా చేయకూడదా? - పెట్రోల్ ధరలపై నిరసన

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్​ ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఘటన స్థలానికి వచ్చినవారిని వచ్చినట్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

CONGRESS PROTEST
కాంగ్రెస్​ ధర్నా

By

Published : Jul 12, 2021, 12:31 PM IST

Updated : Jul 12, 2021, 1:57 PM IST

పెట్రోల్, డీజిల్​, గ్యాస్​ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ ఆందోళనకు దిగింది. హైదరాబాద్​లోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్​ నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్​కుమార్​ యాదవ్​ ఎడ్లబండిపై ఇందిరాపార్కు వద్దకు వచ్చారు. పోలీసులు.. అంజన్​కుమార్​ ఎడ్లబండి దిగకుండా అడ్డుకున్నారు. ఇందిరా పార్కు వద్ద ధర్నాకు అనుమతి లేదని తెలిపారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది.

Jaggareddy: పెట్రోల్​, డీజిల్​ ధరలను నిరసిస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైకిల్​యాత్ర

అరెస్ట్​ల పరంపరం

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్​కుమార్​ యాదవ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నాకు వచ్చిన కాంగ్రెస్​ నేతలను అరెస్టు చేశారు. ధర్నా చౌక్ వద్దకు వచ్చిన పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, ఇతర మహిళా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్​స్టేషన్​కు తరలించారు. పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆందోళన చేస్తుంటే... కరోనాను కారణంగా చూపి అనుమతి లేదంటున్నారని అంజన్​ కుమార్ మండిపడ్డారు.

కాంగ్రెస్​ ధర్నా

PETROL PRICES: వాస్తవానికి లీటరు పెట్రోలు మూలధర రూ.40.90 మాత్రమే.. కానీ

ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ధర్నాకు అనుమతి ఇవ్వాలని ఆదివారం పోలీస్ ఉన్నతాధికారులకు లేఖలు ఇచ్చామని... నిన్న అనుమతినిచ్చి ఇవాళ లేదని చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాత్రం వేలమందితో కార్యక్రమాలు చేపట్టొచ్చా అంటూ ప్రశ్నించారు.

ఇదీ చూడండి:Petrol prices: పెరిగిన పెట్రోల్​ ధర- దిగొచ్చిన డీజిల్​

Last Updated : Jul 12, 2021, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details