తెలంగాణ

telangana

ETV Bharat / crime

Attack: పొలం గట్ల పంచాయతీలో ఇరువర్గాల ఘర్షణ... వేటకొడవళ్లతో దాడి - telangana news

భూ పంచాయతీ చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరువర్గాల ఘర్షణకు దారి తీసింది. వేటకొడవళ్లతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం సుల్తానాపురం గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Attack
Attack

By

Published : Oct 4, 2021, 2:40 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం సుల్తానాపురం గ్రామ శివారులో పొలం గట్ల పంచాయతీ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చిన్న గురుస్వామి, పెద్ద గురుస్వామికి చెందిన పొలం పెద్ద నర్సింహులు, చిన్న నర్సింహులు పొలం పక్కనే ఉంటుంది. పలుమార్లు వారి కుటుంబాల మధ్య గట్ల పంచాయతీ జరిగింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆదివారం రోజు మళ్లీ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు వేటకొడవళ్లతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఇరువర్గాలకు చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్ద గురుస్వామి కుటుంబానికి చెందిన గోవిందు, రాఘవేంద్రకు సైతం స్వల్పగాయాలు అయ్యాయి.

గత కొద్దిరోజులుగా పొలం గట్ల విషయంలో ఇరువురికి గొడవలు జరుగుతున్నాయని బాధితులు తెలిపారు. పోలీసులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. తగిలిన దెబ్బలతో అక్కడి నుంచి తప్పించుకున్నామని పేర్కొన్నారు. ఒకవేళ అక్కడే ఉండి ఉంటే మమ్మల్ని అక్కడికక్కడే చంపేసేవారని తెలిపారు.

పొలం గట్ల విషయంలో ఇంతకుముందు అయిదారు సార్లు మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పలు సార్లు పోలీసులకు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. మళ్లీ అదే విషయంలో ఘర్షణ జరగడంతో వాళ్లు మా పైన వేటకొడవళ్లతో దాడి చేశారు. వెంటనే మేము అక్కడినుండి తప్పించుకున్నాము. ఒకవేళ అక్కడే ఉండి ఉంటే మమ్మల్ని అక్కడికక్కడే చంపేవారు. వారినుంచి మాకు ప్రాణభయం ఉంది. -బాధితుడు

పొలం గట్ల పంచాయితీలో ఇరువర్గాల ఘర్షణ

ఇదీ చదవండి:Drinker: చనిపోయాడకున్నారు...అంతలోనే...

ABOUT THE AUTHOR

...view details