హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విషాదం చోటు చేసుకుంది. పదహారు నెలల చిన్నారి అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన ఆలస్యంగా బయటపడింది. అయితే చిన్నారి విషాహారం తీసుకోవడంతోనే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించినట్లు తెలుస్తోంది.
విషాదం: అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృత్యువాత - హైదరాబాద్ బంజారాహిల్స్ విషాదం
ముక్కుపచ్చలారని చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృత్యువాత పడింది. ఇంటిముందు ఆడుకుంటున్న పాపకు ఒక్కసారిగా నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో తల్లిదండ్రులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో చిన్నారి మృతి
బంజారాహిల్స్‌లోని బసవతారకనగర్‌లో నివసించే పెయింటర్ మహమ్మద్ ఇబ్రహీంకు ముగ్గరు పిల్లలు సంతానం. వారిలో 16 నెలల చిన్నకూతురు ఈనెల 4 వ తేదీన ఇంటిముందు ఆడుకుంటుండగా ముక్కు, నోటి ద్వారా నురగలు వచ్చాయి. తల్లిదండ్రులు వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చిన్నారి మరణించింది. పాప తండ్రి ఇబ్రహీం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.