అప్పుడే పుట్టిన చిన్నారిని.. కనికరం లేకుండా మురుగు కాల్వలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జోరు వర్షం కురుస్తున్న వేళ.. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిన సమయంలో.. పసిపాపను కాల్వలో పడేసి వెళ్లారు.
Child in drainage: అమానుషం.. మురుగు కాల్వలో అప్పుడే పుట్టిన శిశువు - cheerala news
ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. ముక్కు పచ్చలారని చిన్నారిని మురుగు కాల్వలో పడేశారు దుండగులు. కొన ఊపిరితో ఉన్న పాపను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ విఫలమైంది.
ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం
చిన్నారిని గుర్తించిన స్థానికులు కాల్వలోనుంచి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న పొత్తిళ్ల పాపను కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. కొద్ది సేపటికే చిన్నారి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Boy died: పండుగ పూట విషాదం.. గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి