పెళ్లి చేసుకుంటానని చెప్పి తన లైంగిక వాంఛను తీర్చుకొని ఓ యువతిని మోసం చేసిన నిందితున్ని సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గాంధీనగర్‌కు చెందిన ఓ యువతి (25) కుటుంబసభ్యులతో కలిసి గతంలో ఓల్డ్ బోయిన్‌పల్లి దుబాయ్ గేట్లో నివాసముండేది. తన అక్క పిల్లలకు క్షవరం చేయించడానికి స్థానికంగా ఉన్న సెలూన్‌కు వెళ్లిన ఆ యువతికి అందులో పనిచేస్తున్న రామకొండ కనకరాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.
మనసులు కలిశాయని ప్రేమన్నాడు.. కులాలు కలవలేదని పొమ్మన్నాడు! - secunderabad news
పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక వాంఛ తీర్చుకుని తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మోసం, ప్రేమ పేరుతో మోసం
తనను పెళ్లి చేసుకోమని ఆ యువతి కనకరాజును అడగగా.. కులాలు ఒకటి కాకపోవడం వల్ల ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని, తనకు వేరే సంబంధాలు చూస్తున్నాడని చెప్పాడు. అతన్ని నమ్మి మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడని ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. రంగంలోకి దిగిన పోలీసులు కనకరాజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.