తెలంగాణ

telangana

ETV Bharat / crime

Viral video: భార్యను చంపి సూట్​కేసులో ప్యాకింగ్.. సీసీటీవీ వీడియో

ఏపీలో సంచలనం రేపిన తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలోని హత్య కేసు సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. డీబీఆర్ రోడ్​లోని ఓ అపార్ట్​మెంట్​లో భార్యను(Murder) హతమార్చి సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టి తరలిస్తున్న దృశ్యాలను బయటపడ్డాయి.

murder
హత్య, భర్త, భార్య

By

Published : Jun 29, 2021, 3:29 PM IST

Updated : Jun 30, 2021, 9:39 AM IST

viral video: భార్యను హత్య చేసి సూట్ కేసులో తీసుకెళ్లిన భర్త

తిరుపతి రుయా ఆస్పత్రి ఆవరణలో సూట్ కేసులో కాలిన మృతదేహం కేసుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. భార్యను హతమార్చి సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టిన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి.. ఆ సూట్ కేసును బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. డీబీఆర్ రోడ్​లోని ఓ అపార్ట్​మెంట్ నుంచి మృతదేహం ఉన్న సూట్ కేసును బయటకు తీసుకు వచ్చి టాక్సీలోకి ఎక్కించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. హత్య ఉదంతం అనంతరం పరారైన నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని కర్నూలు జిల్లాలో తీసుకుని తిరుపతికి తరలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

కడప జిల్లా బద్వేలుకు చెందిన ఎం.శ్రీకాంత్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని (27) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భువనేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. కరోనా వల్ల వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో మూడు నెలల కిందట వీరు తిరుపతి వచ్చి... డీబీఆర్‌రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో ఏడాదిన్నర వయసు పాపతో కలిసి ఉంటున్నారు. పెళ్లయినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి భువనేశ్వరి ఫోన్‌ పని చేయక పోవడంతో పుట్టింటి వారికి అనుమానం వచ్చి శ్రీకాంత్‌రెడ్డిని నిలదీశారు. భువనేశ్వరికి డెల్టాప్లస్‌ వేరియంట్‌ కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు... అక్కడ ఆమె చనిపోవడంతో తనకూ చూపించకుండా దహనక్రియలు చేసినట్లు చెప్పి... వారిని నమ్మించాడు.

ఇలా బట్టబయలు..

భువనేశ్వరి అక్క కుమార్తె మమత కర్నూలు జిల్లాలో ట్రైనీ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆమె భువనేశ్వరి ఉన్న అపార్టుమెంట్‌ సీసీ కెమెరా ఫుటేజీలను తిరుపతి పోలీసుల సహకారంతో పరిశీలించారు. ఈ నెల 22న ఉదయం కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డి ఎర్రటి సూట్‌కేసుతో వచ్చాడు. మధ్యాహ్నం అదే సూట్‌కేసును లాక్కుంటూ.. కుమార్తెను ఎత్తుకుని ట్యాక్సీ ఎక్కిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత అతను రుయా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ సమీపంలోకి వెళ్లినట్లు దారిలోని సీసీ కెమెరా ఫుటేజీల్లో చూసి గుర్తించారు. అక్కడ సమీపంలోని పొదల చాటున సూట్‌కేసును తెరిచి మృతదేహాన్ని కాల్చేశాడు. ఆ సమయంలో అతని భుజంపై కన్నబిడ్డ ఉంది. అలిపిరి పోలీసులు ట్యాక్సీ డ్రైవరును అదుపులోకి తీసుకొని విచారించడంతో అతను ఈ విషయాలను నిర్ధారించాడు.

ఇదీ చదవండి:

RUIA CASE:RUIA CASE: భార్యపై అనుమానంతో హత్య.. కరోనా మృతిగా చిత్రీకరణ

చదువు కోసమొచ్చి.. వ్యభిచారం వృత్తి..

Last Updated : Jun 30, 2021, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details