తెలంగాణ

telangana

ETV Bharat / crime

నకిలీ పత్రాలు సృష్టించి.. ప్రభుత్వ భూమిని అమ్మేసి.. - CCS police have arrested a gang

నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వ భూములను విక్రయిస్తోన్న ఓ ముఠాని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

CCS police have arrested a gang who was creating fake documents and selling government lands
నకిలీ పత్రాలు సృష్టించి.. ప్రభుత్వ భూమిని అమ్మేశారు

By

Published : Mar 23, 2021, 6:55 AM IST

నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని విక్రయిస్తున్న ఘరానా మోసగాళ్లను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ముద్రణలు స్టాంపు పేపర్లను సృష్టించి.. వందల కోట్ల భూమికి ఎసరుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

వీరి మోసాలపై మిహిరా బిల్డ్ కన్​స్ట్రక్షన్స్, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ కేటుగాళ్లు గతంలో నకిలీ పత్రాలు చూపించి.. బంజారాహిల్స్​లోని రోడ్డు నంబర్ 12లో 9 ఎకరాల 17 గుంటల అత్యంత ఖరీదైన భూమిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం నడిపేందుకు సీసీఎల్ఏ నుంచి జీహెచ్ఎంసీ అధికారుల ముద్రణలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తిరుమల రామచందర్ రావు, దర్పల్లి సంపత్​లను పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:రసాయనాలు మీదపడి ఆరుగురికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details