ఎర్రమట్టి అక్రమార్కులపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. దమ్మపేటలో అనుమతులు లేకుండా అటవీ భూమిలో ఎర్ర మట్టి తరలిస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అశ్వరావుపేట మండలంలోని అల్లిగూడెం రేంజ్ పరిధిలో అటవీ భూముల్లో కొందరు అక్రమార్కులు జీసీబీతో ఎర్ర మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో దమ్మపేట రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలిలో తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన అక్రమార్కులు అక్కడ నుంచి ట్రాక్టర్ను తొలగించారు.
అక్రమంగా ఎర్రమట్టి తరలింపు.. ముగ్గురిపై కేసు నమోదు - తెలంగాణ వార్తలు
అటవీ భూమిలోని ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని అల్లిగూడెం రేంజ్ పరిధిలోని ఎర్రమట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో అటవీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటనపై విచారణ జరిపి... కఠిన చర్యలు తీసుకుంటామని రేంజ్ ఆఫీసర్ తెలిపారు.
అక్రమంగా ఎర్రమట్టి తరలింపు, మట్టి తరలించే వారిపై కేసు నమోదు
ఎర్ర మట్టి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు జీసీబీ యజమానిపై అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జేసీబీని సీజ్ చేసి దమ్మపేటలోని తమ కార్యాలయానికి తరలించారు. దీనిపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:కరోనాతో వృద్ధురాలు మృతి.. జేసీబీతో ఖననం