తెలంగాణ

telangana

ETV Bharat / crime

'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ ! - చిత్తూరు జిల్లా నేర వార్తలు

మూఢ భక్తితో ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు రోజుల క్రితం ఇద్దరు కుమార్తెలను కన్నవారే కడతేర్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు పురుషోత్తం, పద్మజపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ-1గా పురుషోత్తం, ఏ-2 గా పద్మజను చేర్చారు. నిందితులకు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో పద్మజ తన వింత ప్రవర్తనతో అందరినీ హడలెత్తించింది.

madanapalle, sisters murder case
మదనపల్లె, జంట హత్యల కేసు

By

Published : Jan 26, 2021, 5:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్తెలు అలేఖ్య, సాయిదివ్యలను రెండు రోజుల క్రితం దారుణంగా హత్య చేసిన కేసులో.. వారి తల్లితండ్రులు పురుషోత్తం, పద్మజలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మదనపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఐపీసీ 302 కింద కేసు నమోదు చేశారు. ఏ1 గా పురుషోత్తంను, ఏ2 గా పద్మజను చేర్చారు. విచారణ అనంతరం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

'నాకు కరోనా పరీక్షలేంటి ?'

మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో నిందితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తొలుత కరోనా పరీక్షలకు పద్మజ నిరాకరించింది. 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?' అని ఆమె ప్రశ్నించింది. 'నా గొంతులో హాలాహలం ఉంది.. నన్ను అవమానించొద్దు' అని తెలిపింది. ఆసుపత్రిలోకి వచ్చేందుకు నిరాకరించిన ఆమెకు పోలీసు వాహనం వద్దే కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. నిందితులను సైకియాట్రిస్ట్​​కు చూపించారు. పద్మజ మానసిక సమస్యతో బాధపడుతోందని సైకియాట్రిస్ట్ రాధిక తెలిపారు. పద్మజ చెబుతున్న వాటిని పురుషోత్తం అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. నిందితులను రుయా సైకియాట్రిక్​ విభాగానికి తరలించాలని సిఫారసు చేశారు.

'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'

బయటి వ్యక్తుల ప్రమేయం లేదు

మదనపల్లె జంట హత్యల కేసులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ నిరాధారమేనని.. డీఎస్పీ రవిమనోహరాచారి స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్న ఆయన.. సీసీ కెమెరాలతో పాటు దొరికిన ఆధారాలను పూర్తిగా విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. తల్లి పద్మజ, తండ్రి పురుషోత్తంను అరెస్టు చేసినట్లు చెప్పిన డీఎస్పీ.. వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:సీరియల్‌ కిల్లర్: మహిళలే లక్ష్యం... 16 దారుణ హత్యలు!

ABOUT THE AUTHOR

...view details