తెలంగాణ

telangana

ETV Bharat / crime

నకిలీ ఆధార్​తో భూమి కాజేయాలకున్న వ్యక్తిపై కేసు నమోదు

డీఆర్డీవో శాస్త్రవేత్త పేరున నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆయన భూమి కాజేయాలనున్న వ్యక్తిపై పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతి చెందిన శాస్త్రవేత్త భూమి కోసం ఆయన భార్యతో పాటు, మరో వ్యక్తి ఆన్​లైన్​లో దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చౌటుప్పల్​కు చెందిన ఓ వ్యక్తి తప్పుడు ఆధార్​తో భూమి కోసం ఆన్​లైన్​ చేసినట్లు తేలిందని పేర్కొన్నారు.

fake adhaar card, drdo scientists land grab issue
డీఆర్డీవో శాస్త్రవేత్త భూవివాదం, నకిలీ ఆధార్​ కేసు

By

Published : Jun 8, 2021, 8:37 AM IST

డీఆర్డీవో శాస్త్రవేత్త భూమిని తప్పుడు ఆధార్ సృష్టించి కాజేసేందుకు యత్నించిన వ్యక్తిపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూరు గ్రామంలో 497 సర్వేనంబర్​లో హైదరాబాద్​కు చెందిన డీఆర్డీవో శాస్త్రవేత్త హనుమంతరావుకు 20 గుంటల భూమి ఉందని అధికారులు తెలిపారు. గతంలో ఆధార్ కార్డు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు భూ యజమానికి పాసుపుస్తకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. మే నెలలో తానే హనుమంతరావును అంటూ ఆధార్ అప్డేట్ చేసుకుని పాసు పుస్తకాలు ఇవ్వాలని ఓ వ్యక్తి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నాడని వెల్లడించారు.

హనుమంతరావు భార్య కనకదుర్గ తన భర్త చనిపోయాడని... ఫౌతీ కోసం అదేసమయంలో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రెండు దరఖాస్తులు రావడంతో రెవెన్యూ అధికారులు ఇద్దరినీ విచారణ కోసం పిలిపించారు. హనుమంతరావు భార్య చూపించిన పత్రాలు సరైనవిగా గుర్తించినట్లు వెల్లడించారు. రెండో వ్యక్తి మాత్రం రాకపోవడంతో రెవెన్యూ అధికారులు ఆధార్ సహాయంతో శోధించారు. చౌటుప్పల్​కు చెందిన గుర్రం పాండుగా తనిఖీల్లో తేలిందని తహసీల్దార్ మహిపాల్ రెడ్డి పటాన్​చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆధార్​తో భూమి కాజేయాలని ప్రయత్నించిన పాండుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details