తెలంగాణ

telangana

ETV Bharat / crime

లిఫ్ట్​ అడిగారని కారు ఎక్కించుకుంటే.. ఆ ఇద్దరు ఏం చేశారంటే..? - car theft in adilabad

కూతురుని కళాశాలలో వదిలేశారు. కారులో ఒక్కడే ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. సాయంత్రమైంది. కొంత దూరం వెళ్లాక.. రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్​ అడిగారు. "అసలే సాయంత్రమైంది. వాళ్లకు ఎలాంటి పనుందో..? లిఫ్ట్​ ఇస్తే పోయేదేముంది.. కాసింత పుణ్యమొస్తుంది.." అనుకున్నాడు. ఇద్దరినీ ఎక్కించుకున్నాడు. వాళ్లను ఎక్కించుకున్నాక కానీ.. అర్థకాలేదు.. 'పుణ్యం మాట దేవుడెరుగు.. అయ్యో పాపం అనాల్సిన పరిస్థితి వచ్చింది' అని..!

car theft with lift trap in adilabad
car theft with lift trap in adilabad

By

Published : Oct 22, 2021, 5:10 AM IST

లిఫ్ట్​ అడిగారని కారు ఎక్కించుకుంటే.. ఆ ఇద్దరు ఏం చేశారంటే..?
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ కుమార్​కు ఓ కూతురు. ఆమె ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్​లో వైద్య విద్య అభ్యసిస్తోంది. బుధవారం సాయంత్రం అనిల్​కుమార్​ తన కూతురుని రిమ్స్​లో వదిలి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. నేరడిగొండ టోల్​ప్లాజా సమీపంలో.. ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడిగారు. ఎలాగో కారులో ఒక్కడే ఉన్నాడు కాబట్టి.. వాళ్లకు దయార్ధ హృదయంతో లిఫ్ట్​ ఇచ్చాడు.

పాపమని కారులో ఎక్కించుకోవటమే.. అతడి పాపమైంది. వారిని ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్లాక.. ఆ వ్యక్తులు వారి అసలు రూపాన్ని బయటపెట్టారు. దుండగులు తుపాకీతో అనిల్​కుమార్​కు బెదిరించారు. కాళ్ళు చేతులు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ అతికించి చితకబాదారు. కారును మహారాష్ట్రలోని పండర్ కౌడా వైపు పోనిచ్చారు. పండర్ కౌడా సమీపంలో.. కారు అపారు. అనిల్​కుమార్​ దగ్గరున్న రూ.11 వేలు, మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. అతడిని రోడ్డుపై పడేసి.. కారుతో ఉడాయించారు.

కారుతో ఉడాయిస్తున్న దుండగులు

వెంటనే అక్కడి పోలీసులను అనిల్​కుమార్​ సంప్రదించాడు. వారి సహాయంతో నెరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details