సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తా వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న కారు ఆగి వున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జు అవడంతో యువతి మృతదేహం శకలాల్లో ఇరుక్కుపోయింది.
Software engineer dead: ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి - తెాలంగాణ తాజా వార్తలు
ఆగివున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం 65వ నంబరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
ప్రమాద బాధితులు హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన స్నేహితులుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన యువతి నిహారిక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కారు వేగంగా లారీని వెనకనుంచి ఢీకొట్టడంతో కారు ఎడమ భాగం పూర్తిగా దెబ్బతిని మృతదేహం వెలికి తీయడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. క్రేన్ సాయంతో కారును పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: