తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident: కల్వర్ట్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి - road accident

Accident: ఏపీలోని విజయనగరం జిల్లాలో దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి విజయనగరం వైపు వస్తున్న కారు.. నిర్మాణంలో ఉన్న కల్వర్ట్‌ను ఢీకొట్టి రహదారి పక్కనే ఉన్న గొయ్యిలోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Accident
Accident

By

Published : Jul 9, 2022, 8:59 AM IST

Accident: ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒడిశా నుంచి విజయనగరం వైపు వస్తున్న కారు.. నిర్మాణంలో ఉన్న కల్వర్ట్‌ను ఢీకొట్టి రహదారి పక్కనే ఉన్న గొయ్యిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టు నిర్మిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్నవారు దీన్ని గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

మృతదేహాలతో ఉన్న కారును జేసీబీ సహాయంతో బయటికి తీశారు. కారు నెంబర్‌ ఆధారంగా చనిపోయిన వారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. అయితే కారులో 12 గంజాయి ప్యాకేట్లు బయటపడటంతో.. మృతులు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details