Jagtial Accident: జగిత్యాల జిల్లా కేంద్రం గాంధీనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కారు అతివేగం వల్ల ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటనలో కారు బోల్తా పడింది.
కారులో గుట్కా రవాణా.. తప్పించుకోబోయి బైక్, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ - jagtial road accident news
Jagtial Accident: కారులో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. అతివేగంగా వస్తున్న కారు.. బైక్‌ను, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. జగిత్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జగిత్యాల రోడ్డు ప్రమాదం
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన కారులో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. అనుమానంతో కారును పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు తప్పించుకుని వేగంగా వెళ్లింది. ఈ క్రమంలో ముందున్న బైకును ఢీకొట్టిన తర్వాత పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:కంటైనర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, ఏడుగురికి గాయాలు