Rajendra nagar Car Fire Accident: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లోని దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఓ కారు మంటల్లో కాలిపోయింది. శుభకార్యానికి వెళ్లివస్తుండగా... ఒక్కసారిగా కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్.. కుటుంబ సభ్యులతో కలిసి కిందికి దిగడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా.. వారు వచ్చేసరికి కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
Car Fire in Rajendra nagar: ఇంజిన్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. కారు దగ్ధం - రాజేంద్రనగర్లో కారు దగ్ధం వార్తలు
Rajendra nagar Car Fire Accident: ఓ కుటుంబం శుభకార్యంలో పాల్గొంది. సంతోషంగా కారులో తిరుగు ప్రయాణమైంది. కానీ హఠాత్తుగా ఆ కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారులోని వారిని కిందకు దించేశాడు. చూస్తుండగానే ఆ మంటల్లో కారు దగ్ధమైపోయింది.
మంటల్లో కారు దగ్ధం