భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో.. ఓ వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. లోయలో పడి కాలిపోతున్న కారును గుర్తించిన వాహనదారులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అటవీ ప్రాంతంలో కారు దగ్ధం.. మిస్టరీ కేసుగా నమోదు! - మిస్టరీ కేసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఓ కారు దగ్ధమైంది. వాహనదారుల సమాచారం మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మిస్టరీ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అటవీ ప్రాంతంలో కారు దగ్ధం.. మిస్టరీ కేసుగా నమోదు!
వాహనం 3రోజుల నుంచి అదే ప్రాంతంలో నిలిపి ఉన్నట్లు స్థానిక ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. గతంలో తాను తీసిన ఫొటోలను వారికి సమర్పించాడు. కారుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:పెద్దపల్లిలో ఒడిశా కార్మికురాలిపై సామూహిక అత్యాచారం..!