Road Accident: సూర్యాపేట జిల్లా కోదాడలోని గుడిబండ ఫ్లైఓవర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో తల్లిదండ్రులు, కుమార్తె ఉండడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Road Accident: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు సహా చిన్నారి మృతి - రోడ్డు ప్రమాదం
Road Accident: ద్విచక్రవాహనాన్ని కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన బోయల శ్రీనివాస్, నాగమణి దంపతులు వారి ముగ్గురు పిల్లలతో ఒకే ద్విచక్రవాహనంపై చిలుకూరు మండలం సీతారామపురం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెపు వెళ్తున్న కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ఫ్లైఓవర్‌పై నుంచి ఐదుగురు కింద పడిపోయారు. దీంతో శ్రీనివాస్(40) అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో చిన్నకూతురు ఉషశ్రీ(7), ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగమణి(35) మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మేళ్ల చెరువులో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగొస్తున్న మంత్రి దయాకర్‌రావు సంఘటనా స్థలానికి వెళ్లి జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
ఇదీ చదవండి:మహబూబాబాద్ కౌన్సిలర్ దారుణ హత్య.. నడిరోడ్డుపై గొడ్డలితో నరికి..