తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ananthapuram Car Accident: డోనేకల్‌ వద్ద కారు వెలికితీత.. ఒకరి మృతదేహం లభ్యం - Car accident in AP

CAR ACCIDENT: నిర్మాణంలో ఉన్న వంతెన.. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేని పరిస్థితి.. దీంతో అదుపు తప్పి కారు వంకలోకి దూసుకెళ్లిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బళ్లారి వైపు వెళ్తుండగా... జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

Ananthapuram Car Accident
Ananthapuram Car Accident

By

Published : Dec 30, 2021, 9:35 AM IST

వంకలో కారు...ఒకరు మృతి

CAR ACCIDENT: ఏపీలోని అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్​లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బళ్లారి వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వంకలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా...వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి నుంచి క్రేన్ల ద్వారా కారును బయటకు తీసేందుకు ప్రయత్నించగా..ఈరోజు ఉదయం బయటకు తీశారు. కారులో ఓ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి బళ్లారి వాసిగా పోలీసులు భావిస్తున్నారు.

జేఈపై గ్రామస్థుల ఆగ్రహం..

రెండు సంవత్సరాలు గడుస్తున్నా..బ్రిడ్జి మరమ్మతులు చేపట్టకపోవటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడికి వచ్చిన జేఈపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

అసలు ఎం జరిగిందంటే..

బుధవారం రాత్రి దొనేకల్‌ వద్ద గల జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు లోయలోకి దూసుకెళ్లింది. దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతులో కారు పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న గుంతకల్‌ డీఎస్పీ నర్సింగప్ప, విడపనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, క్రేన్‌సాయంతో కారును బయటికి తీయించే ప్రయత్నం చేశారు. దొనేకల్‌, కడగరబింకి గ్రామస్థులు సైతం భారీగా తరలివచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే.. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కాగా.. ఇవాళ తెల్లవారుజామున కారును బయటకు తీయించారు. అయితే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:rape on student in shamirpet : 9వ తరగతి విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు అత్యాాచారం

ABOUT THE AUTHOR

...view details