హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వచ్చిన కారు మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నగరానికి చెందిన వేణు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మద్యంమత్తులో కారు నడుపుతూ... మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు! - తెలంగాణ వార్తలు
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడిపే వ్యక్తి మద్యం మత్తులో ఉండి.. మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.
జూబ్లిహిల్స్ కారు బీభత్సం, హైదరాబాద్ కారు ప్రమాదం
బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా 173 పాయింట్లు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్ వెళుతుండగా ప్రమాదం జరిగిందని.... గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండకూడదు: మంత్రి ఎర్రబెల్లి
Last Updated : Apr 5, 2021, 3:36 PM IST