తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిద్రలోకి జారుకున్న బస్సు డ్రైవర్​.. చివరికి ఏమైందంటే? - బస్సు డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తా

Palamaneru Bus Accident: బస్సు డ్రైవర్​ నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మంది గాయపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Palamaneru Bus Accident
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

By

Published : Dec 2, 2022, 7:06 PM IST

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

Palamaneru Bus Accident: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పలమనేరు క్యాటల్ ఫార్మ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్​ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరో 20 మందికి గాయలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారని పోలీసులు తెలిపారు.

బెంగళూరు నుంచి విజయవాడకు బయల్దేరిన బస్సు పలమనేరు వద్ద ప్రమాదానికి గురైంది. మరణించిన వ్యక్తి గుంటూరు జిల్లా వాసి విజయ్​గా పోలీసులు గుర్తించారు. డ్రైవర్​ నిద్ర మత్తులో బస్సు నడపటం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details