తెలంగాణ

telangana

ETV Bharat / crime

చిరుత దాడిలో బర్రెదూడ మృతి

చిరుత దాడిలో బర్రె దూడ మరణించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది.

buffalow  dies in leopard attack in vikarabad district
చిరుత దాడిలో బర్రెదూడ మృతి

By

Published : Feb 12, 2021, 4:36 AM IST

చిరుత దాడిలో బర్రెదూడ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన బలిజ చంద్రయ్యకు చెందిన దూడపై (బర్రె పిల్ల) చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో దూడ మరణించింది.

తమ గ్రామ పరిసరాల్లో గత కొన్ని నెలలుగా చిరుత సంచరిస్తుందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయమై పలుమార్లు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ.. చిరుతను బంధించటం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:మైనర్​పై అత్యాచారం.. ముగ్గురు యువకులపై కేసు

ABOUT THE AUTHOR

...view details