తెలంగాణ

telangana

ETV Bharat / crime

మహిళను దారుణంగా హతమార్చి, ఆపై - దోపిడీ హత్య

Woman murder in nellore ఓ మహిళను అతి కిరాతకంగా హత్యచేసి ఒంటి మీద బంగారు నగలు దోచుకెళ్లిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలలో చోటుచేసుకుంది. చీరాలలోని ఆంధ్రరత్న రోడ్డులో వూట్ల మదనగోపాలమూర్తి, విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి గొంతునులిమి, తలమీద మోది అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ అగంతకుడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లాడు. విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసిన భర్త.. పోలీసులకి సమాచారం అందించారు. హత్య చేసి పారిపోతున్న నిందితుడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

మహిళను దారుణంగా హతమార్చి, ఆపై
మహిళను దారుణంగా హతమార్చి, ఆపై

By

Published : Aug 30, 2022, 11:32 AM IST

మహిళను దారుణంగా హతమార్చి, ఆపై

Woman murder in nellore: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో దంపతుల దారుణ హత్య జరిగిన ఘటన మరువక ముందే బాపట్ల జిల్లా చీరాలలో అలాంటి మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అతి కిరాతకంగా హతమార్చాడు ఓ దుండగుడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. చీరాల భావనారుషిపేటలో దంపతులు ఊట్ల విజయలక్ష్మి (55), మదనగోపాలమూర్తి నివసిస్తున్నారు. భర్త మదనగోపాలమూర్తి సోమవారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో ఇంటి నుంచి బజారుకు వెళ్లి అరగంట తరువాత తిరిగి వచ్చారు. లోపలికి వెళ్లేందుకు తలుపు కొట్టగా ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తి కంగారుగా పరిగెత్తుతూ వచ్చి మెట్ల పైనుంచి పక్కింటి మీదుగా పరారయ్యాడు. వెంటనే మదనగోపాలమూర్తి లోపలకు వెళ్లి చూడగా భార్య రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలను తెప్పించారు.

వారు సేకరించిన సీసీ ఫుటేజ్‌లో నీలం రంగు చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి హడావుడిగా పరుగెడుతున్న ఓ వ్యక్తిని గుర్తించారు. హత్య జరిగిన ప్రాంతం నుంచి ప్రగడ కోటయ్య విగ్రహం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు మీదుగా రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ రోడ్డులో చేతిలో సంచితో పరుగెత్తాడు. ఈ వీడియో, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దొంగతనానికి వచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడా? మరే కారణమైనా ఉందా? అన్న కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ పి.శ్రీకాంత్‌ తెలిపారు.

పథకం ప్రకారమే హత్య: అల్పాహారం తెచ్చేందుకు భర్త మదనగోపాలమూర్తి బజారుకు వెళ్లి వచ్చేలోగానే ఈ ఘాతుకం జరిగింది. దీంతో దుండగుడు పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. రెండంతస్థుల భవనంలో ఉంటున్న వీరు కింద దుకాణానికి అద్దెకిచ్చి పైఅంతస్థులో నివసిస్తున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న గృహిణి గొంతు నులిమి తలను నేలకు మోది చంపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితం ఒకరు మృతి చెందగా, మరొకరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. 3 నెలలుగా విజయలక్ష్మి తన కుమారుడి వద్ద ఉండి.. పది రోజుల కిందటే చీరాల వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details