జగద్గిరిగుట్ట సమీపంలోని సంజయ్ గాంధీ నగర్లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. దేవమ్మ బస్తీలో నివాసం ఉంటూ పెయింటర్‌గా పనిచేస్తున్న సురేష్(25) అనే వ్యక్తిని రోషన్, రోహిత్ అనే వ్యక్తులు అటోలో వచ్చి దాడి చేశారు. కడుపులో కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు, సురేష్ అక్కడిక్కడే కుప్పకూలగా.. గమనించిన స్థానికులు రక్తపుమాడుగులో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య - HYDERABAD CRIME NEWS
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
యువకుడి దారుణ హత్య
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు... వీరిమధ్య పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: