నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు పొడిచి చంపేశాడు. జిల్లాలోని దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో హన్మంతు, బుగ్గప్ప అన్నదమ్ములు. ఇద్దరి మధ్య కొంతకాలంగా భూ తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పటిలాగే మంగళవారం రాత్రి హన్మంతు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు.
తమ్ముని చేతిలో హత్యకు గురైన అన్న - కత్తితో అన్నను హత్య చేసిన తమ్ముడు
కొంత కాలంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూ వివాదం కొనసాగుతోంది. అది కాస్తా చంపుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలో అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు అతనిని విచాక్షణా రహితంగా పొడిచి చంపాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది.
తమ్ముని చేతిలో హత్యకు గురైన అన్న
ఆ సమయంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. ఎలాగైనా అన్నను అంతమొందించాలనుకున్న తమ్ముడు బుగ్గప్ప.. పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తితో అన్నను విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో హన్మంతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్ష నిమిత్తం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఆరేళ్ల చిన్నారిని మింగేసిన ఇనుపకూలర్...