Bike Hits tractor: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ట్రాక్టర్ను వెనుక నుంచి ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
Bike Hits tractor: ఘోర ప్రమాదం.. అన్నాచెల్లెలు సహా బాలుడు దుర్మరణం - అద్దంకి - నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ప్రమాదం
Bike Hits tractor: నల్గొండ జిల్లాలో ఓ ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లెలు సహా ఓ బాలుడు మరణించాడు. ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జయింది.
అద్దంకి- నార్కెట్పల్లి జాతీయ రహదారిపై బోత్తులపాలెం వద్ద వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి ట్రాక్టర్ వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. మృతులు వాడపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతులు అంజి (21), అంజలి (17) అన్నా చెల్లెలు కాగా మరో 8 ఏళ్ల బాలుడు నవదీప్గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీచూడండి:LIVE VIDEO: గుండెపోటుతో ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాడు.. అక్కడే కుప్పకూలాడు!