Boy was bitten by a snake : పెళ్లయి పదహారేళ్లకు పుట్టిన కొడుకును కంటికిరెప్పలా చూసుకుంటున్నారు ఆ దంపతులు. కానీ చనిపోయిందనుకున్న పాము ఆ బాలుడిని కాటేసి వారికి విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. బైరెడ్డి సంతోష్-అర్చన దంపతుల కుమారుడైన నైతిక్(2) గురువారం వేకువజామునే నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడుకుంటున్నాడు. అదే సమయంలో పాము కనిపించడంతో గ్రామంలోని వారు దాన్ని కర్రతో కొట్టి చనిపోయిందనుకుని పక్కకు జరిపారు.
పాము చనిపోయిందనుకుంటే.. బాబుని చంపేసింది - ఆదిలాబాద్‌లో బాబుని కుట్టిన పాము
Boy was bitten by a snake : పిల్లలు పుట్టాలని ఆ భార్యాభర్తలు వెళ్లని గుడి లేదు.. చేయని పూజ లేదు.. మొక్కని దేవుడు లేడు. ఎట్టకేళకు పెళ్లైన పదహారేళ్లకు ఆ దేవుడు కరుణించాడు. వాళ్లకి ఓ వారసుణ్ని ప్రసాదించాడు. లేకలేక పుట్టిన ఆ కుమారుణ్ని చూసుకుని ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కానీ ఇంతలోనే విధి కన్నెర్ర చేసింది. వారి జీవితంలో కల్లోలం సృష్టించింది. పాము రూపంలో పసికందును కాటేసి కన్నవాళ్లను పుట్టెడు దుఃఖంలో ముంచేసింది.
Boy was bitten by a snake
ఇంతలోనే ఆ పాము హఠాత్తుగా పైకిలేచి పక్కన నిలబడి చూస్తున్న మహిళ చేతిలోని చిన్నారి నైతిక్‌ను కాటేసింది. హుటాహుటిన బాలుణ్ణి వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి నైతిక్ చనిపోయినట్లు నిర్ధరించారు. ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన తర్వాత పుట్టిన బిడ్డ కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం చూసి స్థానికులు కంటతడి పెట్టారు.