suspicious foreigners arrested in Bodhan: నిజమాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో సూడాన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. పుణేకు చెందిన విద్యార్థితో అనుమానస్పదంగా కనబడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. సుడాన్‌లోని ఓ కంపెనీకి పాత ట్రాక్టర్ల స్పేర్ పార్ట్స్ సరఫరా చేస్తామని విదేశీయులు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బోధన్ ప్రాంతంలో ఇద్దరు విదేశీయులు పట్టుబడడం కలకలం రేపింది. వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సూడాన్ దేశానికి చెందిన హమీద్, ఉమర్గా గుర్తించారు.
Sudan people arrested: బోధన్‌లో ఇద్దరు విదేశీయులు అరెస్ట్.. ఎందుకంటే..? - నిజమాబాద్ జిల్లా బోధన్
Two foreigners arrested in Bodhan: నిజమాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు విదేశీయులు పట్టుబడడం కలకలం రేపింది. ట్రాక్టర్ కొనుగోలుకు వచ్చామని వీరు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Sudan people arrest
పుణెకు చెందిన అసద్‌తో కలిసి బోధన్ మండలం ఖండ్గాం గ్రామంలో ట్రాక్టర్ కొనుగోలుకు వచ్చామని విదేశీయులు తెలిపారు. వీరిలో ఒకరు స్టూడెంట్ వీసా.. మరొకరు బిజినెస్ వీసాపై వచ్చారని పోలీసులు నిర్దరించారు. వారి వీసా గడువు ముగిసిందని.. హైదరాబాద్ నుంచి బోధన్ వచ్చారని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:Betting with pigeons: పావురాలతో పందేలు.. ముఠా అరెస్టు
Last Updated : Feb 8, 2022, 2:06 AM IST