తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుత్బుల్లాపూర్​లో భారీ పేలుడు... భయంతో జనం పరుగులు

కుత్బుల్లాపూర్​ పరిధిలోని జైరాంనగర్‌ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజసామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

By

Published : May 12, 2021, 2:25 AM IST

Updated : May 12, 2021, 4:51 AM IST

blast in kutbullapur
కుత్బుల్లాపూర్​లో భారీ పేలుడు

కుత్బుల్లాపూర్​లో భారీ పేలుడు... భయంతో జనం పరుగులు

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ జైరాంనగర్‌ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను విసరడంతో ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజసామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పేలుడు శబ్దం సుమారు కిలోమీటర్‌కుపైగా వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో మరో బ్యాగు ఉండడంతో పోలీసులు ఇంకో బ్యాగ్‌ను తెరవడానికి డాగ్‌ స్క్వాడ్‌ రప్పించారు.

అందులో చెత్తఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తనకు బ్యాగ్‌ బాలానగర్‌లో దొరికిందని, దానిని తీసుకువస్తుండగా కుక్కలు మొరగడంతో పడేసినట్లు అనుమానితుడు పోలీసులతో చెప్పాడు. దీంతో క్లూస్‌ టీమ్‌ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కొడుకుని అతి దారుణంగా హత్య చేసిన తండ్రి

Last Updated : May 12, 2021, 4:51 AM IST

ABOUT THE AUTHOR

...view details