తెలంగాణ

telangana

ETV Bharat / crime

కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు.. వారి కోసమేనా? - అన్నం ముద్దలు ముగ్గులు

Kshudra Pooja In Bus: కంప్యూటర్ కాలంలో పరుగులు పెడుతున్న రోజులివి. కానీ ఎక్కడో ఒకచోట మూఢ నమ్మకాలను నమ్ముతూ పాతకాలం రోజులని గుర్తుచేస్తూ మనుషులను భయాందోళనకు గురిచేస్తున్నారు . తాజాగా అలాంటి సంఘటనే ఏలూరు జిల్లాలో జరిగింది. కాలేజీ ​బస్సులో క్షుద్రపూజలు చేయడం స్థానికంగా కలకలం రేపింది.

Black Magic in School Bus
Black Magic in School Bus

By

Published : Feb 14, 2023, 10:18 PM IST

Kshudra Poojas In Bus: డిజిటల్ యుగంలో కాలంతో పోటీ పడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాము. కానీ కొందరు చేసే పనులు పాత రోజులను గుర్తుచేస్తున్నాయి. తాజాగా ఓం..హ్రీం..ఫట్.. అని మంత్రాలు చదువుతూ ఆర్చర్యానికి గురిచేస్తున్నారు ఇలాంటి మంత్రాలు మంత్రగాళ్లు నోట వింటూ ఉంటాం. ఈ ఘటనలు జీవితంలో ఒక్కసారైనా మన చెవిలో పడుతూ ఉంటాయి. వాళ్లు తమకూ కావలసిన వాటి కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కొందరు చేసే పనులు మనల్ని ఆశ్చర్యానికి, భయానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం కాలేజీ బస్సును పసుపు, నిమ్మకాయలతో అలంకరించి క్షుద్ర పూజలు చేయడం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాన్ని భయాందోళనకు గురి చేస్తోంది.

Black Magic in School Bus ఆంధ్ర ప్రదేశ్ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో విసన్నపేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సులో అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కృష్ణారావు పాలెం సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కాలేజీ బస్సులో నిమ్మకాయలు, అన్నం ముద్దలు ముగ్గులు వేసి అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు.

బస్సును పసుపు, కుంకుమలతో అలంకరించారు. నోటీస్ బోర్డుకు మీద నిమ్మకాయల దండ వేసి, విచిత్రమైన ఆకారంలో బొమ్మలు వేశారు. బస్సు పైభాగన చేతి హస్తం గుర్తులు ఉన్నాయి. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్నం ముద్దలతో పూజలు చేసిన ఆనవాళ్లు చూసి కాలేజీకి వెళదామని బస్సు ఎక్కడానికి వచ్చిన విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. వికాస్ స్కూల్ యజమాన్యం మరొక బస్సు పంపించి విద్యార్థులను కాలేజీకి తరలించారు. వాలైంటైన్స్ డేన జరగడం విద్యార్థినిలు ఆందోళన చెందుతున్నారు. ఈ పని ఎవ్వరూ, ఎందుకు చేశారనేది ఇప్పటికి తెలియలేదు.

కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు.. వారి కోసమేనా?

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details