Raja singh Arrest భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. పెద్దఎత్తున వచ్చిన ఫిర్యాదులతో రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్దే షాహినాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొల్లారం ఠాణాకు తరలించారు. ఆయన ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రాజాసింగ్ అరెస్టు విషయం తెలిసి ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. భారీ సంఖ్యలో వస్తున్న కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్ అరెస్టు, చావడానికైనా సిద్ధమంటున్న ఎమ్మెల్యే - మునావర్ ఫారుఖ్
10:12 August 23
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ అరెస్టు
ఓ వర్గం మనోబావాలు దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రాజాసింగ్ పోస్ట్ చేసిన వీడియోను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజసింగ్పై చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాజాసింగ్‌పై డబీర్పురాతో పాటు పలు పోలీస్స్టేషన్లలో వరుస ఫిర్యాదులు అందాయి.
తనపై నమోదైన కేసులపై రాజాసింగ్ స్పందించారు. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారుఖీ హైదరాబాద్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా షో జరిపించారని రాజాసింగ్ మండిపడ్డారు. పోలీసులకు ముందే దండం పెట్టి వేడుకున్నా వినలేదన్నారు. మునావర్ ఫారుఖికి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పినట్టు గుర్తుచేశారు. అలా చేసిన వీడియోను యూట్యూబ్‌లో పెడితే తొలగించారని తెలిపారు. రెండో భాగం వీడియో త్వరలో అప్లోడ్ చేస్తామని చెప్పారు.
"రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారుఖీ హైదరాబాద్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా షో జరిపించారు. పోలీసులకు ముందే దండం పెట్టి వేడుకున్నా వినలేదు. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసలు ఎలా రక్షణ కల్పిస్తారు. మునావర్ ఫారుఖ్‌కి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను. అలా చేసిన వీడియోను యూట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తాను. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగిన నేను రెడీ. ధర్మం కోసం నేను చావడానికైనా సిద్ధం." - రాజాసింగ్, ఎమ్మెల్యే
ఇవీ చూడండి: