కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనం దొంగతనం జరిగింది. ఓ బేకరీ యజమాని షాపు ముందు వాహనం నిలిపి ఉంచారు. ఓ దొంగ ద్విచక్రవాహనంపై తాపీగా అక్కడికి వచ్చాడు. తన బైక్‌ను పక్కన నిలిపాడు. అటూ ఇటూ దిక్కులు చూశాడు. ఎవరూ గమనించడం లేదని భావించాడు. తన దగ్గరున్న తాళాలతో ఇంకో ద్విచక్రవాహనం స్టార్ట్ చేశాడు.
ద్విచక్ర వాహనం చోరీ... సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
ద్విచక్రవాహనాన్ని ఓ దొంగ అపహరించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. అతడు చేసిన దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనం చోరీ... సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
తాను వచ్చిన వాహనం వదిలేసి మరోదానిపై వెళ్లిపోయాడు. ద్విచక్రవాహనం దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దొంగ వదిలేసిన వాహనం కూడా మరో చోట ఎత్తుకొచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: దొంగ ఓట్లపై ఆడియో కలకలం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్